భారీ విజువల్స్ తో అలరించిన వార్ టీజర్


war teaser

భారీ విజువల్స్ తో అలరించిన వార్ టీజర్

హృతిక్ రోషన్ , టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన వార్ టీజర్ ఈరోజు విడుదల చేసారు . భారీ విజువల్స్ తో ఈ టీజర్ ఉండటంతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది . వార్ టీజర్ అలా విడుదల అవ్వడమే ఆలస్యం ఇలా దూసుకుపోతోంది . భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో యూత్ ని విశేషంగా అలరిస్తోంది వార్ టీజర్ . ఇక ఈ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది .

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించడం విశేషం . అక్టోబర్ 2 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు . టైగర్ ష్రాఫ్ తో పోటీపడి మరీ హృతిక్ రోషన్ సాహసాలు చేయడం ఈ వార్ ప్రత్యేకత . భారీ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి . ఇటీవలే సూపర్ 30 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హృతిక్ , ఇక గాంధీ జయంతి కానుకగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హృతిక్ రోషన్ .