దిల్ రాజుకు షాకిస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్‌?


దిల్ రాజుకు షాకిస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్‌?
దిల్ రాజుకు షాకిస్తున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్‌?

మ‌స్ రాజా ర‌వితేజ న‌టించిన `క్రాక్` చిత్రాన్ని వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ నైజాంలో రిలీ‌జ్‌ చేసిన విష‌యం తెలిసిందే. తొలి వారం కూడా పూర్తి కాకుండానే ఈ మూవీకి కేటాయించిన థియేట‌ర్ల‌ని త‌గ్గించార‌ని, కావాల‌నే ఆ థియేట‌ర్ల‌ని త‌మిళ చిత్రం `మాస్ట‌ర్‌`కు కేటాయించార‌ని మీడియా ముఖంగా వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ ఇండైరెక్ట్‌గా దిల్ రాజుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

దీంతో ఒక్క‌సారిగా అత‌ని పేరు ఇండ‌స్ట్రీ అంతా మారుమ్రోగిపోయింది. తాజాగా వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజుకు మ‌రో షాక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` నైజాం డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల్ని వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ ద‌క్కించుకున్న‌ట్టు తాజా స‌మాచారం. ఇందు కోసం భారీగానే కోట్ చేసిన‌ట్టు తెలిసింది.

`ఇస్మార్ట్ శంక‌ర్‌`తో నైజాం పింపిణీ దారుడిగా మంచి పే‌రు తెచ్చుకున్న వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ స‌ర్కారు వారి పాట‌`తో పాటు నాని న‌టిస్తున్న ` అంటే.. సుంద‌రానికి` చిత్ర నైజాం హ‌క్కుల కోసం కూడా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, ఇందు కోసం భారీగానే కోట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. తాజా అడుగుల‌తో దిల్ రాజుకు నైజాంలో చెక్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌తో వ‌రంగ‌ల్ శ్రీ‌నివాస్ వ‌రుస భారీ ప్రాజెక్ట్‌ల‌ని ద‌క్కించుకుంటున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ హాట్ చ‌ర్చ‌గా మారింది.