గ్యాంగ్ లీడర్ : ఇలా అయితే ఎలా నాని


weak promotions for nanis gang leader
weak promotions for nanis gang leader

న్యాచురల్ స్టార్ నాని సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరో 48 గంటల్లో గ్యాంగ్ లీడర్ విడుదలవుతున్నా ప్రీ బుకింగ్స్ చూస్తుంటే సినిమాపై జనాల్లో ఏ మాత్రం బజ్ లేదన్న విషయం తెలిసిపోతోంది. బుకింగ్స్ ఓపెన్ అయినా ఇంకా చాలా చోట్ల హాళ్లు సగం కూడా నిండకపోవడం గమనార్హం. దర్శకుడు విక్రమ్ కుమార్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ కు తోడు సినిమా జోనర్ కూడా బి, సి సెంటర్లలో ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

వీటికి తోడు మైత్రి మూవీ మేకర్స్ వీక్ ప్రమోషన్స్ కూడా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయి. డిజిటల్ స్పేస్ లో ఒక ప్రమోషనల్ సాంగ్ మినహా మైత్రి మూవీస్ చేసిందేం లేదు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేసి చేతులు దులిపేసుకుంది. ఎంత మౌత్ టాక్ తో నడవాల్సిన సినిమా అయినా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ చాలా కీలకం. చిత్ర యూనిట్ కావాలనే లో ప్రొఫైల్ రిలీజ్ కోరుకుంటున్నారో లేదో తెలియదు కానీ గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకున్న సినిమాకి పబ్లిసిటీ చేసే విధానం ఇది కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.