మహేష్ బాబు మేనల్లుడి చిత్రం ఏమైంది?What Happen Ashok Gallas Movie
What Happen Ashok Gallas Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ సూపర్ హై లో వెళ్తోంది. వరసగా మూడు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం హాలిడేలో ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా సంగతి వచ్చాక చూసుకుంటాడు. ఇప్పటికే వంశీ పైడిపల్లి తో ఈ సినిమా ఉంటుందని డిసైడ్ చేసేసాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇవన్నీ మంచి వార్తలే. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ నుండి తన బావ సుధీర్ బాబు ఒక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే మహేష్ కు ఎంతో ఇష్టమైన మరో బావ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేయాలన్న ప్రయత్నాలు గత కొంత కాలంగా జరుగుతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మాణంలో ఒకసారి అలాంటి ప్రయత్నమే జరిగింది. కారణమేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. లాంచింగ్ దగ్గరే ఆగిపోయింది.

మళ్ళీ కొంచెం టైమ్ తీసుకుని ఈసారి భలే మంచి రోజు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్యను దర్శకుడిగా పెట్టుకుని అశోక్ గల్లా హీరోగా సినిమాను లాంచ్ చేసారు. శ్రీరామ్ ఆదిత్య తర్వాత శమంతకమణి, దేవదాస్ వంటి సినిమాలు తీసి ఉన్నాడు. అంగరంగ వైభవంగా అశోక్ గల్లా డెబ్యూ మూవీ లాంచ్ జరిగింది. ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ స్వయంగా వచ్చి తన విషెస్ చెప్పాడు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. జయదేవ్ గల్లా నిర్మాతగా మారుతూ అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్న విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇదంతా నవంబర్ లో జరిగింది. అయితే రెండు నెలలు పూర్తయినా ఈ సినిమా గురించి అప్డేట్ లేదు. నిధి అగర్వాల్ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉంది. మరి అశోక్ గల్లా తొలి సినిమా సంగతి ఏమైనట్లు? సైలెంట్ గా షూటింగ్ కానిచేస్తున్నారా? లేదా ఏదైనా కారణంతో బ్రేక్ ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది.