వివాదంలో బిగ్‌బాస్ సీజ‌న్ 2 ఫేమ్!


 

What happend Bigboss fame nuthan naidu's house
What happend Bigboss fame nuthan naidu’s house

బిగ్‌బాస్ సీజ‌న్ 2 లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఈ రియాలిటీ షో  ద్వారా పాపుల‌ర్ అయ్యారు నూత‌న్ నాయుడు. తాజాగా  ఈయ‌న ఓ వివాదంలో చిక్కుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఏపీకి చెందిన నూత‌న్ కుమార్ నాయుడు చుట్టూ తాజాగా ఓ వివాదం మొద‌లైంది. త‌న ఇంట్లో ప‌న‌రి చేస్తున్న ఓ ద‌ళితుడు వున్న‌ట్టుండి ప‌ని మానేయ‌డంతో ఆగ్ర‌హించిన నూత‌న్ కుమార్ నాయుడు భార్య మ‌ధు ప్రియ బ‌ల‌వంతంగా శిరోముండ‌నం చేయించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌నే ఏపీలో జ‌ర‌గ‌డంతో రాష్ట్ర‌ప‌తి ఈ సంఘ‌ట‌న‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. తాజాగా మ‌రో ద‌ళిత యువ‌కుడు క‌ర్రి శ్రీ‌కాంత్‌ని శిరోముండ‌నం చేయించి అవ‌మానించ‌డం తీవ్ర క‌ల‌కలం రేసుతోంది. త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై ఆగ్ర‌హించిన క‌ర్రి శ్రీ‌కాంత్ పెందుర్తి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డంతో ఈ వివాదం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

పెందుర్తి పోలీసులు ప్ర‌స్తుతం ఈ వివాదంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పెందుర్తి స‌మీపంలోని గిరిప్ర‌సాద్ న‌గ‌ర్‌లో నివాసం వుంటున్న నూత‌న్ కుమార్ నాయుడు ఇంట్లో గ‌త నాలుగు నెల‌ల క్రితం క‌ర్రి శ్రీ‌కాంత్ ప‌నికి చేరాడు. వ్య‌క్తిగాత కార‌ణాల‌తో ఆగ‌స్టులో మానేశాడు. అయితే సెల్ పోన్ దొంగిలించాడ‌నే నెపంతో క‌ర్రి శ్రీ‌కాంత్‌పై ఆగ్ర‌హించిన నూత‌న్ నాయుడు భార్య మ‌ధుప్రియ శిరోముండ‌నం చేయించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.