మ‌ణిర‌త్నం కొడుక్కి ఏమైంది?

 

What happend to Maniratnams son
What happend to Maniratnams son

క‌రోనా వైర‌స్ విక‌టాట్ట‌హ‌సం చేస్తోంది. ప్ర‌పంచం మొత్తం దీని దెబ్బ‌కు అన్నీ బంద్ చేసి చేష్టలుడిగి చూస్తోంది. కానీ ప్ర‌భుత్వాలు మాత్రం దీన్ని గ‌ట్టిగా ఎదుర్కోవాల‌ని, నివార‌ణ ఇక్క‌టే దీనికి ఏకైక మార్గ‌మ‌ని చెబుతోంది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఈ నెల 31న వ‌రకు లాకౌ డౌన్‌ ప్ర‌క‌టించింది. రాష్ట్రాలు కూడా లాకౌట్‌ని పాటించాల‌ని, స్వీయ నిర్భంధాన్ని పాటించాల‌ని సూచిస్తోంది.

కొంత మంది స్వీయ నిర్భాంధాన్ని ప్ర‌క‌టిస్తూ స‌ర్వ‌జ‌న ర‌క్ష‌ణ కోసం త‌మ వంత బాధ్య‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన కొంత మంది మాత్రం ఎవ‌రెక్క‌డ పోతే నాకేంటి? నాకు ఎలాంటి క‌రోనా సోక‌లేద‌ని నిర్భంధం నుంచి బ‌య‌టికి వ‌చ్చి త‌మ తోటి వారికి ఆ వైర‌స్‌ని అంటిస్తూ హీనులుగా మారుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ణిరత్నం దంప‌తులు త‌మ కుమారుడిని స్వీయ నిర్భంధంలో పెట్టేశారు.

కొద్ది రోజుల క్రితం వీరి కుమారుడు నంద‌న్ ఇటీవ‌ల లండ‌న్ నుంచి ఇండియా వ‌చ్చాడు. అత‌నికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అత‌నికి స్వీయ నిర్భంధం విధించారు. దీనికి సంబంధించిన వీడియోని న‌టి ఖుష్బూ సుంద‌ర్ సోష‌ల్ మీడియా ట్విట్ఱర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.