`ఆర్ఆర్ఆర్` నిర్మాత‌కు ఏమైంది?


`ఆర్ఆర్ఆర్` నిర్మాత‌కు ఏమైంది?
`ఆర్ఆర్ఆర్` నిర్మాత‌కు ఏమైంది?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా `ఆర్ ఆర్ ఆర్‌` పేరుతో భారీ మ‌ల్టీస్టార్ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌లో 70 శాతం పూర్త‌యింది. 30 చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్‌గా వుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఈ వారంలోనే ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్యకు ఇటీవ‌ల హార్ట్ పెయిన్ వ‌చ్చింద‌ని, విష‌యం తెలిసిన వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ని ఆసుప‌త్రిలో చేర్పించార‌ని తెలిసింది. ఒక బ్లాక్‌ను స‌రిచేయ‌డం కోసం డాక్ట‌ర్లు ఆయన‌కు ఒక స్టెంట్ వేసిన‌ట్టు వేసిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం  ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే వుంద‌ని, ఆయ‌న క్షేమంగా కోలుకుంటున్నార‌ని తెలిసింది.

నిర్మాత దాన‌య్య యాంజియోప్లాస్టీ నుంచి ప్ర‌స్తుతం కోలుకుంటున్నార‌ని తెలిసింది. ఆయ‌న నిర్మిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్ ఈ వారంలో ప్రారంభం కాబోతోంది. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. అలియా భ‌ట్ ఒలివియా మోరీస్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.