శ్రియ భ‌ర్త ఆండ్రూకు ఏమైంది?


శ్రియ భ‌ర్త ఆండ్రూకు ఏమైంది?
శ్రియ భ‌ర్త ఆండ్రూకు ఏమైంది?

ర‌ష్య‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్‌, బిజినెస్ మెన్ ఆండ్రూ కోస్చీవ్‌ని శ్రియ ప్రేమించి పెళ్లాడిన విష‌యం తెలిసిందే. 2018లో వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌రువాత ఆండ్రూకి సంబంధించిన వీడియోల‌తో ఇన్ స్టాని నింపేస్తూ హంగామా చేస్తోంది శ్రియ‌. అయితే తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌యంక‌ర‌మైన క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో శ్రియ భ‌ర్త‌కు సంబంధించిన ఓ వార్త ఆమె అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

శ్రియ ఓ డాక్ట‌ర్‌తో త‌న భ‌ర్త ఆరోగ్యం గురించి వాక‌బు చేస్తున్న వీడియో ఆస‌క్తిక‌రంగా మారింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. శ్రియ భ‌ర్త ఆండ్రూ విదేశీయుడు. క‌రోనా వైర‌స్ కూడా అత్య‌ధికంగా విదేశీయుల్లోనే ఎక్కువ‌గా వైర‌ల్ అవుతోంది. ఇట‌లీ, స్పెయిన్ లాంటి దేశాల్లో దీని ధాటికి జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో శ్రియ భ‌ర్త ఆండ్రూకి కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని ప్ర‌చారం మొద‌లైంది.

దీనికి ముందు కంగారుప‌డినా ఆ త‌రువాత డాక్ట‌ర్ల‌ని సంప్ర‌దించ‌డంతో అజిత్రో మైసిన్ టాబ్లెట్స్ వాడ‌టం వ‌ల్ల ఆండ్రూకి పూర్తిగా త‌గ్గిపోయింద‌ని, ప్ర‌స్తుతం అత‌ను పూర్తి ఆరోగ్యంగా వున్నాడ‌ని శ్రియ వెల్ల‌డించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంత అన్న‌ది శ్రియ వెల్ల‌డిస్తే కానీ స్ప‌ష్ట‌త రాదు. మ‌రి శ్రియ వెల్ల‌డిస్తుందా?  లేక లైట్ తీసుకుంటుందో చూడాలి అంటున్నారు నెటిజ‌న్స్‌.