నిన్నటి మీటింగ్ లో ఏం జరిగిందో తెలుసా


What happened in tollywood secret meeting?

నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పలువురు అగ్ర హీరోలు సమావేశమయ్యారు . మెగాస్టార్ చిరంజీవి లీడ్ తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో చిరు తో పాటు వెంకటేష్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , చరణ్ , అల్లు అర్జున్ , నాగచైతన్య లతో పాటుగా పలువురు హీరోలు పాల్గొన్నారు . గతకొంతకాలంగా ఫిలిం ఇండస్ట్రీ లో జరుగుతున్న విషయాలు అందరినీ తీవ్ర కలకలానికి గురి చేసాయి .

పైగా కొన్ని న్యూస్ చానళ్ళు పనిగట్టుకొని ఇండస్ట్రీ ని అలాగే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిన నేపథ్యంలో సదరు ఛానళ్ల ని బ్యాన్ చేయాలనీ ఒకరిద్దరు అభిప్రాయపడినప్పటికీ బ్యాన్ అనే పదం వాడటం వల్ల వివాదం మరింత ముదరడం ఖాయమని అందుకే బ్యాన్ అని కాకుండా సహాయ నిరాకరణ చేస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారట . లక్షలలో యాడ్స్ రూపంలో డబ్బులు ఇస్తున్నాం కానీ మన వల్ల ఆర్ధికంగా ఎదుగుతున్న ఆ ఛానళ్లు మనల్ని టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి న్యూస్ ఛానళ్ల కు యాడ్స్ ఇవ్వకుండా ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్ల కు మాత్రమే సపోర్ట్ చేయాలనీ భావించారట ! అయితే ఇంకా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు కానీ ఆ దిశగా అయితే ఆలోచన చేస్తున్నారట ఇండస్ట్రీ పెద్దలు .