కొండా సురేఖ మాట‌ల్లో నిజ‌మెంత‌?కొండా సురేఖ మాట‌ల్లో నిజ‌మెంత‌?
కొండా సురేఖ మాట‌ల్లో నిజ‌మెంత‌?

వైఎస్ మ‌ర‌ణానంత‌రం మొద‌లైన తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కొండా సురేఖ దంప‌తులు వైఎస్‌. జ‌గ‌న్‌కు అండగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ మానుకోట‌లో అడుగు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఓదార్పు యాత్ర‌లో భాగంగా మానుకోట‌ను సంద‌ర్శించే ముసుగులో పార్టీ ప్ర‌చారం కోసం వ‌చ్చారు. అయితే ఈ యాత్ర‌ని తెరాస వ‌ర్గాలు భ‌గ్నం చేశాయి.

తాముండ‌గా తెరాస జ‌గ‌న్ యాత్ర‌ని ఎలా భ‌గ్నం చేస్తుంద‌ని ఆగ్రహించిన కొండా సురేఖ‌, కొండా ముర‌ళి తెరాస శ్రేణుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ‌టంతో అక్క‌డ చిన్న పాటి యుద్ధ‌వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది.  ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లో సైలెంట్ అయిపోయిన కొండా దంప‌తులు ఆ త‌రువాత అనూహ్యంగా తెరాస గూటికి చేర‌డం, అక్క‌డ పొస‌గపోవ‌డంతో మ‌ళ్లీ కాంగ్రెస్ జెండా ప‌ట్టుకోవ‌డం తెలిసిందే. గ‌త కొంత కాలంగా మౌనంగా వున్న కొండా సురేఖ దంప‌తులు మ‌ళ్లీ స్వ‌రం పెంచాల‌ని, రాజ‌కీయాంగా త‌మ ఉనికిని చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

ఈ నేప‌థ్యంలో కొండా సురేఖ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌న‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ని ఏపీ సీఎంకు కేసీఆర్ తాక‌ట్టు పెట్టార‌ని, ఇరి గేష‌న్ ప్రాజెక్ట్‌లు క‌డుతున్నా సైలెంట్‌గా వుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టింది. గ‌తంలో జ‌గ‌న్‌పై కాలు దువ్విన కేసీఆర్ ఇప్పుడెందుకు ప్రేమ‌ను కురిపిస్తున్నార‌ని, లోపాయ కారి ఒప్పందం కార‌ణంగానే ఒక‌రంటే ఒక‌రు  ప్రేమ‌లు కురిపించుకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంత ప్రేమ వుంటే ఉభ‌య రాష్ట్రాల జ‌ల వివాదంపై కేంద్రం ఎందుకు క‌ల‌గ‌జేసుకుంటోంద‌ని మండిప‌డింది. ఇక వైఎస్ జ‌గ‌న్ సుప‌రి పాల‌న కోసం కాకుండా ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపిపై క‌క్ష సాఇంచ‌డానికే ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన‌ట్టుగా వుంద‌ని సురేఖ స్వ‌రం పెంచ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల‌కి అంతుచిక్క‌డం లేదు. ఈ ఇద్ద‌రిపై సురేఖ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వున్న నిజ‌మెంత‌? .. త‌ను చెప్పేవే నిజాలైతే సురేఖ ఇంత కాలం మౌనంగా ఎందుకున్నారు? ఏం చేస్తున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు కామెంట్‌లు చేస్తున్నారు.