పూన‌మ్ లైక్ ఎందుకు కొట్టిన‌ట్టు?


పూన‌మ్ లైక్ ఎందుకు కొట్టిన‌ట్టు?
పూన‌మ్ లైక్ ఎందుకు కొట్టిన‌ట్టు?

గ‌త కొన్ని నెల‌లుగా పూన‌మ్‌కౌర్ వార్త‌ల్లో నిలుస్తోంది. సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఆమె చేస్తున్న కామెంట్స్ ఎవ‌రిని ఉద్దేశించి అన్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. ఆమె చేస్తున్న న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు ప‌వ‌న్‌ని పొగుడుతోందా?  లేక తిడుతోందా? అన్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. పూన‌మ్ పెడుతున్న పోస్ట్‌లు అటు రాజ‌కీయాల్లోనూ, ఇటు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

త‌న వ్యాఖ్య‌ల‌పై చ‌ర్చ జ‌రుగుతున్నా త‌ను మాత్రం మంచి ఫొటోలు వాడండి అంటూ మీడియా వ‌ర్గాల‌కు  స‌ల‌హాలిస్తోంది. ఇట‌వ‌ల ఎన్టీఆర్ 97వ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ని సంద‌ర్శించిన పూన‌మ్ ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  డెవిల్స్‌తో పోరాడేందుకు నాకు శ‌క్తినివ్వండి అంటూ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా ప‌వ‌న్‌పై న‌టి రోజూ గుండుకు సంబంధిచిన వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ వీడియోని పూన‌మ్ కౌర్ లైక్ కొట్ట‌డం ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు.