రామ్‌చ‌ర‌ణ్ యాక్టీవ్ నిర్మాతే: మ‌్యాట్నీ


రామ్‌చ‌ర‌ణ్ యాక్టీవ్ నిర్మాతే: మ‌్యాట్నీ
రామ్‌చ‌ర‌ణ్ యాక్టీవ్ నిర్మాతే: మ‌్యాట్నీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై హీరో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి కొర‌టాల స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ చిత్రానికి రామ్‌చ‌ర‌ణ్ పేరుకే నిర్మాత అని, అస‌లు నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి అని ప్ర‌చారం మొద‌లైంది. ఖ‌ర్చు చేయ‌కున్నా నిర్మాత‌గా రామ్‌చ‌ర‌ణ్ పేరుని ఏసార‌ని మ‌రింత‌గా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ చిత్రానికి సంబంధించి చిరంజీవి, హీరో రామ్‌చ‌ర‌ణ్ పారితోషికం కాకుండా లాభాల్లో వాటాని తీసుకుంటున్నార‌ని, అందులో భాగంగానే కొణిదెల బ్యాన‌ర్ నేమ్ ని ఈ చిత్రానికి వాడుకుంటున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే దీనిపై మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత నిరంజ‌న్‌రెడ్డి శ‌నివారం క్లారిటీ ఇచ్చారు. రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రానికి త‌న‌తో పాటు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని. ఓ నిర్మాత ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అలానే అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న ప్ర‌మేయం వుంటోంద‌ని వెల్ల‌డించారు.

ఈ సినిమా విష‌యంలో రెండు నిర్మాణ సంస్థ‌లు ఈక్వ‌ల్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, ఇందులో ఒక‌రు త‌క్కువ ఒక‌రు ఎక్కువ అనేది లేద‌ని, రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రానికి త‌న‌తో పాటు యాక్టివ్ ప్రొడ్యూస‌రేన‌ని నిరంజ‌న్‌రెడ్డి మీడియాకు విడుద‌ల చేసిన ఓ లేఖ‌లో స్ప‌ష్టం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అన్న‌ట్టు ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ విష‌యాన్ని చిరంజీవి ఇటీవ‌ల `ఓ పిట్ట‌క‌థ‌` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Credit: Twitter