న‌డిగ‌ర్ సంఘంలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు!

న‌డిగ‌ర్ సంఘంలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు!
న‌డిగ‌ర్ సంఘంలో మ‌ళ్లీ రాజుకున్న చిచ్చు!

త‌మిళ ఇండ‌‌స్ట్రీలో న‌డిగ‌ర్ సంఘం రాజ‌కీయాలు త‌మిళ రాజ‌కీయాల‌ని విస్మ‌యానికి గురిచేసే స్థాయిలో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. మాజీ అధ్య‌క్షుడు శ‌ర‌త్ కుమార్ అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని, సంఘం నిధుల్ని దుర్వినియోగం చేశాడంటూ ఎన్న‌క‌ల బ‌రిలో విశాల్‌, అత‌ని ప్యానెల్ శ‌ర‌త్‌కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో న‌డిగ‌ర్ సంఘం వార్త‌ల్లో నిలిచింది.

ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో విశాల్ ప్యాన‌ల్ స‌భ్యులు విజ‌యం సాధించారు. ఈ ప్యాన‌ల్ నుంచి నాజ‌ర్ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయినా న‌డిగ‌ర్ సంఘంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిత్యం గొడ‌వ‌ల‌తో మారుమ్రోగిపోతూనే వుంది. నాజ‌ర్ అధ్య‌క్ష పీఠం ఎక్కిన త‌రువాత 10 కోట్ల రూపాయ‌ల నిధులు దుర్వినియోగం అయ్యాయని స‌భ్యులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీంతో త‌మిళ‌నాట న‌డిగ‌ర్ సంఘం ర‌చ్చ మొద‌లైంది.

అంతే కాకుండా కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విశాల్ తీరు, త‌ను తీసుకుంటున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై కూడా స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. న‌డిగ‌ర్ సంఘం డ‌బ్బులు ఎలా ఎందుకు దుర్వినియోగం అయ్యాయ‌న్ని తెలియాల‌ని దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. అదే స‌మ‌యంలో న‌డిగ‌ర్ సంఘంలో అగ్రి ప్ర‌మాదం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో ప‌లు కీల‌క ప‌త్రాలు అగ్రికి ఆహుతి అయ్యాయ‌ట‌. దీంతో స‌భ్యులు ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంద‌ని, కావాల‌నే కుట్ర‌లో భాగంగానే న‌డిగ‌ర్ సంఘంలోని కీల‌క ఫైళ్లని అగ్నికి ఆహుతి చేశార‌ని స‌భ్యులు విశాల్ వ‌ర్గంపై మండిప‌డుతున్నారు.