చరణ్, ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేది ఎప్పుడు?


When will Ram Charan NTR complete their work for RRR
When will Ram Charan NTR complete their work for RRR

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే చెప్పిన టైమ్ కు కచ్చితంగా రావు అన్న స్థాయి అభిప్రాయం అందరిలోనూ పడిపోయింది. అయితే ఆర్ ఆర్ ఆర్ విషయంలో రాజమౌళి చాలా కచ్చితంగా ఉన్నాడు. 2020లో ఎలాగైనా తన సినిమా వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేసాడు. ఈ విషయంలో అందరికీ అనుమానాలున్నా చూద్దాం లే అన్నట్లుగా వ్యవహరించారు. అయితే జులై 30, 2020న తమ సినిమా వస్తుందని అధికారికంగా ప్రకటించినప్పుడు అందరూ నిజమేనని నమ్మారు. షూటింగ్ లో ఆలస్యమైనా కానీ ఈ డేట్ ను మిస్ అవ్వమని చెప్పుకొచ్చారు ఆర్ ఆర్ ఆర్ టీం.

దీంతో జులై 30 రిలీజ్ కు అందరూ ఫిక్స్ అయిపోయారు. కొంతమంది గాసిప్ రాయుళ్లు అయితే పది అడుగులు ముందుకేసి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మార్చ్ కల్లా పూర్తైపోతుందని, సో మే నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ ఐపోతారని, తమ తర్వాతి సినిమాలను మొదలుపెట్టేస్తారని, 2021 సంక్రాంతికి ఆ సినిమాలు విడుదలైపోతాయని రాసుకుంటూ వచ్చేసారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పేసారు.

అయితే ఇప్పుడు అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి 2021కి మారిపోయింది. దీంతో గాసిప్స్ పుట్టించిన వాళ్ళ కష్టం వృథా అయిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అంటే దానికి నాలుగైదు నెలలు ముందు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రీ అవుతారేమో. దాని తర్వాత డబ్బింగ్ పనులు, ప్రమోషన్స్ వర్క్ అంటూ మరో రెండు, మూడు నెలల పని ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఆర్ ఆర్ ఆర్ నుండి ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఎప్పుడు తమ తర్వాతి సినిమాలు మొదలుపెడతారు అన్న చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కువైంది. 2018లో సినిమాను విడుదల చేసిన ఎన్టీఆర్ కు 2019 లో సినిమా లేదు, 2020 లో కూడా ఉండబోదు. ఇక రామ్ చరణ్ 2018 సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. అంటే సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్ళీ సంక్రాంతికే రానున్నాడన్నమాట.