విశ్వ‌క్‌సేన్‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌రు?


విశ్వ‌క్‌సేన్‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌రు?
విశ్వ‌క్‌సేన్‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌రు?

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో..ఎవ‌రు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టం. జీరోలు రాత్రికి రాత్రే ఇక్క‌డ హీరోలైన ఉదంతాలు ఈ మ‌ధ్య కాలంలో చాలానే జ‌రిగాయి. అందుకే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎదుటివారిని అంచ‌నా వేయాలి. అయితే ఇదేమీ ప‌ట్ట‌ని ఓ ప్రొడ్యూస‌ర్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేని అవ‌మానించిన‌ట్టు తెలిసింది. `వెళ్లిపోమాకే` సినిమా త‌రువాత విశ్వ‌క్‌సేన్ ఈ ప‌రిస్థితిని ఓ నిర్మాత నుంచి ఎదుర్కొన్న‌ట్టు తెలిసింది.

ఓ టీవీ ఛాన‌ల్ లో ప్ర‌పాద‌రం అవుతున్న టాక్ షోకు యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్‌భాస్క‌ర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న విశ్వ‌క్‌సేన్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న సినీ ఎంట్రీకి సంబంధించిన విష‌యాల్ని వెల్ల‌డిస్తూనే తొలి సినిమా `వెళ్లిపోమాకే` త‌రువాత త‌న‌ని అవ‌మానించి ఓ నిర్మాత ఉదంతాన్ని చెప్పుకొచ్చారు.

త‌న‌కు అవ‌కాశం ఇస్తాన‌ని, తానే హీరోన‌ని మాటిచ్చిర క‌థ చెప్పించాడ‌ట‌. అందులో న‌లుగురు హీరోల్లో మెయిన్ హీరో విశ్వ‌క్‌సేన్ అన్నార‌ట‌. ఆ త‌రువాత త‌న‌ని నెల రోజుల త‌రువాత అదే పాత్ర‌ని మ‌రో వ్య‌క్తికిచ్చార‌ట‌, ఇలా.. ఇలా.. చివ‌రికి విశ్వ‌క్‌సేన్ పాత్ర నాలుగ‌వ పాత్ర‌కు మారిపోయింద‌ట‌. దీంతో చిర్రెత్తుకొచ్చిన విశ్వ‌క్‌సేన్ తానే ఎందుకు సినిమా తీయ‌కూడ‌ద‌ని `అంగ‌న‌మ‌లై డైరీస్‌`ని తెలుగులో చేశాడ‌ట‌. అది మొద‌లుపెట్టేలోపే త‌రుణ్‌భాస్క‌ర్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని ఆ త‌రువాతే `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` చిత్రాన్ని రూపొందించాన‌ని చెప్పుకొచ్చాడు. అయితే త‌న‌ని అవ‌మానించిన నిర్మాత ఎవ‌ర‌నేది మాత‌కం విశ్వ‌క్ బ‌య‌ట పెట్ట‌లేదు. విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం `పాగ‌ల్‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది.