త‌మ‌న్నాని హార్ట్ చేసింది ఎవ‌రు?


త‌మ‌న్నాని హార్ట్ చేసింది ఎవ‌రు?
త‌మ‌న్నాని హార్ట్ చేసింది ఎవ‌రు?

స్టార్ హీరోయిన్ స‌మంత హోస్ట్‌గా `ఆహా` ఓటీటీ కోసం సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఈ టాక్ షో స్ట్రీమింగ్ మొద‌లైంది. ఈ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు రానా, నాగ్ అశ్విన్‌, సైనా నెహ్వాల్ దంప‌తులు పాల్గొని త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల్ని షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ షోలో త‌మ‌న్నా పాల్గొంది. ఇటీవ‌లే త‌మ‌న్నాకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమోలోనే ప‌లు ఆస‌క్తిక‌ర వియాల్ని వెల్ల‌డించిన త‌మ‌న్నా తాజాగా టాక్ షోలో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకుంది.

కోవిడ్ భారిన ప‌డిన త‌రువాత త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితుల్ని తాజాగా వెల్ల‌డించారు. ఇదే సంద‌ర్భంగా త‌మ‌న్నా త‌న‌ని తాను ఎలా అభివ‌ర్ణించుకున్నారో స‌మంత బ‌య‌ట‌పెట్టింది. త‌మ‌న్నా కాఫీ ప్రియురాల‌ని, అప్పుడ‌ప్పుడు క‌వి కూడా అవుతార‌ని తెలిపింది. ఆ త‌రువాత వెంట‌నే మీరు క‌విత‌లు రాస్తారా నాకు తెలియ‌లేద‌ని త‌మ‌న్నాని ప్ర‌శ్నించింది.

దీనికి స‌మాధానంగా `ఎప్పుడైతే మ‌న హృద‌యం ముక్క‌ల‌వుతుందో అప్పుడు మ‌నం క‌విత‌లు రాస్తాం.. ఈ విష‌యం నీక్కూడా తెలుసు అని ట‌క్కున చెప్పింది. మ‌న జీవితంలో అలాంటిది జ‌రిగిన‌ప్పుడు మ‌నం క‌విగా మారుతుంటాం. ఈ స‌మాజంలో ఎదుటి వారి హృద‌యాన్ని ముక్క‌లు చేసే వారున్నారు` అని త‌మ‌న్నా స‌మాధానం చెప్పింది. `త‌మ‌న్నా హార్ట్ ని బ్రేక్ చేసే ధైర్యం ఎవ‌రికి వుంది? ఆ వ్య‌క్తి ఎవ‌రో క‌ని పెట్టాలి` అంటూ సామ్ చ‌మ‌త్క‌రించింది.