పిడుగు లాంటి వార్త చెప్పిన టెడ్రోస్ అధ‌నోమ్‌!Who director tedros adhanom shocking statment on corona virus
Who director tedros adhanom shocking statment on corona virus

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైరెక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నోమ్ మ‌రోసారి ప్ర‌‌పంచానికి పిడుగులాంటి వార్త‌ని వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ముందు యావ‌త్ ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించి దారుణ‌మైన ఈ దుర్గ‌తి నుంచి కాపాడే వీలున్నా టెడ్రోస్ ఆల‌స్యం చేయ‌డం, ఆప్ప‌మ‌త్తంగా లేక‌పోవ‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది. దారుణ వైర‌స్‌ల గురించి ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించాల్సిన టెడ్రోస్ చైనాకు కీలు బొమ్మ‌గా మారార‌ని అమెరికా అధ్య‌క్షుడు గ్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారంటే ఏ స్థాయిలో నిర్ల‌క్ష్యంగా వున్నారో అర్థ‌మ‌వుతోంది.

చైనాలోని పూహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. తాఇజా విప‌త్తు విష‌యంలో దారుణంగా విఫ‌ల‌మైన టెడ్రోస్ రోజుకో విధంగా స్పందిస్తూ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నారు. ఏడాది లోపు వైర‌స్ వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతుంటే ప‌దేళ్ల వ‌ర‌కు దీనితో క‌లిసి జీవించాల్సిందే వేరే ప్ర‌త్య‌మ్న‌యం లేద‌ని టెడ్రోస్ ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేసింది. తాజాగా టెడ్రోస్ పిడుగులాంటి వార్త‌ని వెల్ల‌డించారు.

క‌రోన‌రా వైర‌స్‌కు మందు లేద‌ని, వైర‌స్‌ను రూపు మాపే చికిత్స ఇప్ప‌ట్లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలే లేవ‌ని, ఎప్ప‌టికీ ఈ వైర‌స్‌ని అంతమొందించ‌లేమ‌ని ప్ర‌క‌టించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న నిపుణులు విస్తూ పోయేలా చేసింది. ఇంత‌కీ టెడ్రోస్ ప్ర‌జ‌ల్ని భ‌య‌పెడుతున్నారా?  లేక వైర‌స్ ప‌ట్ల అప్ప‌మ‌త్తంగా వుండ‌మ‌ని చెబుతున్నారా అని అంతా సెటైర్లు వేస్తున్నారు.