రానా ఫియాన్సీ ఎవ‌రు? ఆమె ఏం చేస్తుంది?


రానా ఫియాన్సీ ఎవ‌రు? ఆమె ఏం చేస్తుంది?
రానా ఫియాన్సీ ఎవ‌రు? ఆమె ఏం చేస్తుంది?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్, టాలీవుడ్ హంక్ హీరో రానా ద‌గ్గుబాటి పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా పెళ్లి వార్త‌ల‌పై స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకుతిరిగిన రానా మంగ‌ళ‌వారం స్వ‌యంగా త‌ను పెళ్లి చేసుకోబోయే యువ‌తి గురించి వెల్ల‌డించి షాకిచ్చారు. సోష‌ల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా త‌ను వివాహం చేసుకోబోతున్న విష‌యాన్ని వెల్ల‌డిస్తూ త‌న ఫియాన్సీ ‌తో క‌లిసి దిగిన ఫొటోని రానా షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

మ‌న టాలీవుడ్ హంక్ మ‌న‌సుదోచిన ఆ యువ‌తి పేరు మిహీకా బ‌జాజ్‌. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంప‌నీని నిర్వ‌హిస్తున్న మ‌హికా బ‌జాజ్ హైద‌రాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ముంబై, లండ‌న్‌ల‌లో ఉన్న‌త విధ్య‌ను అభ్య‌సించారు. డ్యూ డ్రాప్ స్టూడియో పేరుతో ఓ కంప‌నీనీ ఏర్పాటు చేసి వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నారు. మిహీకా త‌ల్లి బంటీ బ‌జాజ్ ప్ర‌ముఖ జువెల్ల‌రీ డిజైన‌ర్‌. రానా, మిహీకా గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న‌ట్టు తెలుస్తోంది.

లాక్‌డౌన్ త‌రువాత వీరి వివాహానికి సంబంధించిన నారా ఫాద‌ర్‌, నిర్మాత డి. సురేష్‌బాబు వెల్ల‌డించే అవ‌కాశం వుంది. రానా ప్ర‌స్తుతం `విరాట‌ప‌ర్వం`, అర‌ణ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ప్ర‌భు సాల్మ‌న్ తెర‌కెక్కిం చిన  `అర‌ణ్య` త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.