ఆ మూగ్గురు స్టార్స్‌లో `డెవిల్‌` ఎవ‌రు?


Who is the devil of Sandeep Vangas film
Who is the devil of Sandeep Vangas film ?

టాలీవుడ్‌లో మూస చిత్రాల‌కి భిన్నంగా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `అర్జున్‌రెడ్డి`. తెలుగు యిత్రాల్లో గేమ్ ఛేంజ‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ, హిందీ భాష‌ల్లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగించింది. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్‌ని చేసింది. బాలీవుడ్‌లో `క‌బీర్‌సింగ్`పేరుతో తీసిన ఈ చిత్రం  9 కోట్ల మార్కెట్‌కే ప‌రిమిత‌మైన షాహీద్‌క‌పూర్‌ని 30 కోట్ల డిమాండ్ చేసే స్థాయిలో నిల‌బెట్టింది. బాలీవుడ్‌లో `క‌బీర్‌సింగ్‌` 300 కోట్ల‌కు మించి వ‌సూళ్లు సాధించ‌డంతో ద‌ర్శ‌కుడు సందీప్ వంగ త‌దుప‌రి సినిమాపై క్రేజ్ ఏమై వుంటుందా? అనే ఆస‌క్తి మొద‌లైంది.

`క‌బీర్ సింగ్‌` త‌రువాత మ‌హేష్‌తో సందీప్ వంగ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అది ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇద్ద‌రి నుంచి కొత్త ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఆ మ‌ధ్య ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో సందీప్ వంగ నెక్స్ట్ ఫిల్మ్ వుంటుంద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రిగింది. దానికి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. తాజాగా సందీప్ వంగ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని, `సాహో` చిత్రానికి స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన టీ సిరీస్ మైత్రీ మూవీస్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయ‌ని ఫిలిం స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

`డెవిల్‌`పేరుతో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా  తెర‌పైకి రానున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ గెట‌ప్‌, పాత్ర చిత్ర‌ణ కొత్త‌గా వుంటాయ‌ట‌. ఇప్పిటికే ఈ సినిమా కోసం ప్ర‌భాస్‌కు 13 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చార‌ని. త్వ‌ర‌లో మిగ‌తా మొత్తం అందించి చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. `డెవిల్‌` మ‌హేష్‌, ర‌ణ్‌బీర్‌ల‌ని దాటి ప్ర‌భాస్‌కు ద‌క్కింద‌ని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.