ఆ ముగ్గురిలో ఎవ‌రికి జై కొడ‌తారు?


ఆ ముగ్గురిలో ఎవ‌రికి జై కొడ‌తారు?
ఆ ముగ్గురిలో ఎవ‌రికి జై కొడ‌తారు?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. పరశ్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

`పోకిరి`, అతిథి చిత్రాల త‌ర‌హాలో హెయిర్ స్టైల్‌, చెవికి పోగు, మెడ‌పై రూపాయి బిళ్ల టాటూ, టైటిల్‌లో గంట సింబ‌ల్ వెర‌సి ఈ సినిమా చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌కెక్క‌నుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తోంది.  భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ని, దాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు కొట్టేసిన ఓ ఘ‌రానా మోస‌గాడి క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో బ‌ల‌మైన విల‌న్ పాత్ర వుంది. ఆ పాత్ర కోసం ఇప్ప‌టికే ప‌ర‌శురామ్ అన్వేష‌ణ మొద‌లుపెట్టి ముగ్గురు క్రేజీ స్టార్ల ద‌గ్గ‌ర ఆగిపోయాడు. ఆ ముగ్గురు అర‌వింద‌స్వామి, ఉపేంద్ర‌, సుదీప్‌. ఈ ముగ్గురు న‌ట‌న‌లో ఎక్స్‌ప‌ర్ట్. వీరిలో ఒక్క‌రిని ఈ చిత్రం కోసం విల‌న్‌గా ఎంచుకోవాల‌ని ప‌ర‌శురామ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇంకా చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాలేద‌ని… ఎవ‌రిని ఫైన‌ల్ చేయ‌నున్నార‌న్న‌ది త్వ‌ర‌లోనే రివీల్ కానుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.