ఇద్దరిలో విజయం సాధించేది ఎవరు?


Ranarangam and Evaru Movie Posters
Ranarangam and Evaru Movie Posters

ఈనెల 15 న శర్వానంద్ నటించిన రణరంగం , అడవి శేష్ నటించిన ఎవరు ? చిత్రం విడుదల అవుతున్నాయి . అయితే ఈ రెండు చిత్రాల్లో విజయం సాధించేది ఎవరు ? అన్నది ఆసక్తికరంగా మారింది . శర్వా నటించిన రణరంగం మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం , శర్వానంద్ ఈ చిత్రంలో రెండు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు . యంగ్ శర్వా గా ఆకట్టుకుంటాడు దానిలో సందేహమే లేదు అయితే వయసు మీద పడిన డాన్ గా అలరిస్తాడా ? అన్నది చూడాలి .

ఇక అడవి శేష్ విషయానికి వస్తే …….. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ఓ విభిన్న అభిరుచితో వెళ్తున్నాడు …… విజయాలు సాధిస్తున్నాడు . పైగా ఈరోజు విడుదలైన ఎవరు ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది . ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఎవరు పై కూడా అంచనాలు పెరిగేలా ఉన్నాయి . దాంతో విజయం కోసం ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి . అయితే ఈ రెండు చిత్రాల్లో విజయం సాధించేది ఎవరు ? అన్నది తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఎదురుచూడాల్సిందే .