మోనాల్‌ని కావాల‌నే కాపాడుతున్నారా?



మోనాల్‌ని కావాల‌నే కాపాడుతున్నారా?
మోనాల్‌ని కావాల‌నే కాపాడుతున్నారా?

బిగ్‌బాస్ సీజ‌న్ 4 డిసెంబ‌ర్ 20తో గ్రాండ్ ఫినాలేకి చేర‌బోతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో 25 డేస్ మాత్ర‌మే వుండ‌టంతో బిగ్‌బాస్ హౌస్‌లో రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కొత్త కొత్త గేమ్‌లు.. కంటెస్టెంట్‌ల‌ని కాపాడేంద‌కు కొత్త త‌ర‌హా టాస్క్‌ల‌ని ప్ర‌వేశ‌పెడుతున్నాడు బిగ్‌బాస్‌. ఈ నేప‌థ్యంలో బిగ్‌బాస్ తీరుపై ప‌లువురు అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త నాలుగు వారాలుగా నామినేష‌న్స్‌లో వుంటూ వ‌స్తున్న మోనాల్ గ‌జ్జ‌ర్ చివ‌రి క్ష‌ణంలో సేఫ్ అయిపోతోంది.

ఇదెలా సాధ్యం అని అంతా అవాక్క‌వుతున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ తీరుపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మిగ‌తా స‌భ్యులు ఎలిమినేట్ అవుతుంటే మోనాల్ మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు సేవ్ అవుతూ వ‌స్తోంది. టాస్క్‌ల‌లో మోనాల్ వీక్‌గా వున్నా స‌రే బిగ్‌బాస్ అమెని సేఫ్ చేయ‌డం చాలా మందికి న‌చ్చ‌డం లేదు. దిస్ ఈజ్ అన్ ఫేర్ అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో వున్న ఏకైక గ్లామ‌ర్ మోనాల్‌. ఆ పాయింట్ వ‌ల్లే ఆమెని నిర్వాహ‌కులు బ‌య‌టికి పంప‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. రేటింగ్స్ కోస‌మే బిగ్‌బాస్ టీమ్ మోనాల్‌ని కాపాడుతూ వ‌స్తోంద‌ని నెటిజ‌న్స్‌, ఆడియ‌న్స్ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆడియ‌న్స్ ఓటింగ్ ఆధారంగానే కంటెస్టెంట్‌ల‌ని ఎలిమినేట్ చేస్తున్నామ‌ని ఇందులో ఎలాంటి మానిపులేష‌న్ లేద‌ని బిగ్‌బాస్ టీమ్ చెబుతున్నా మోనాల్ విష‌యంలో మాత్రం ఖ‌చ్చితంగా బిగ్‌బాస్ డ్రామా న‌డుస్తోంద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. దీంతో బిగ్‌బాస్ షో విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.