శ్రీ రెడ్డి బయోపిక్ లో ఎవరు నటిస్తున్నారో ?


who will act in Sri reddy biopic టాలీవుడ్ లో బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది , ఇప్పటికే పలు బయోపిక్ చిత్రాలు బాలీవుడ్ లో విడుదలై సంచలన విజయాలు అందుకోగా తాజాగా టాలీవుడ్ లో మహానటి చిత్రంతో ఆ ట్రెండ్ కొనసాగుతోంది . ప్రస్తుతం ఎన్టీఆర్ , సైరా …… నరసింహారెడ్డి , యాత్ర , కత్తి కాంతారావు , చిత్రాలతో పాటుగా మరో అరడజను చిత్రాలు బయోపిక్ గా రానున్నాయి వాటి సంగతి పక్కన పెడితే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి బయోపిక్ కూడా రంగం సిద్ధం అవుతోంది . శ్రీరెడ్డి బయోపిక్ లో శ్రీరెడ్డి పాత్రలో శ్రీరెడ్డి నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో మాత్రం ఎవరు నటిస్తున్నారో ఇప్పటివరకైతే ఇంకా ఎంపిక కాలేదు .

శ్రీరెడ్డి తో పాటుగా ఆమె ఆరోపణలు చేసిన హీరోలు నాని , రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం , రాఘవ లారెన్స్ , తమిళ హీరో శ్రీకాంత్ , కోన వెంకట్ , ఖుష్భు భర్త దర్శకుడు సుందర్ సి , అల్లు అరవింద్ తనయుడైన ఓ వ్యక్తి ఇలా చాలాపెద్ద లిస్టే ఉంది శ్రీరెడ్డి లీక్స్ లో . అయితే ఈ వివాదాస్పద బయోపిక్ లో ఆ పాత్రల్లో ఎవరు నటించనున్నారు ? శ్రీరెడ్డి లీక్స్ లో వచ్చిన పేర్లన్నీ సినిమాలో కూడా ఉంటాయా ? అలాగే అమెరికా లో వ్యభిచారం చేసిన హీరోయిన్ లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు , సింగర్ లు , యాంకర్ ల పేర్లు కూడా బయట పెడుతుందా ? వీళ్ళ పేర్లు బయట పెడితే వాళ్ళు ఊరుకుంటారా ? ఎన్ని వివాదాలు చుట్టుముడతాయి …… అసలు ఈ బయోపిక్ సక్రమంగా తెరకెక్కుతుందా ? ఇలాంటి బోలెడు చిక్కుముడులు ఉన్నాయి మరి .

English Title: who will act in sri reddy biopic