బిగ్ బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీళ్లేనా?

Who will be eliminated from Bigg Boss Telugu 3 in this week
Who will be eliminated from Bigg Boss Telugu 3 in this week

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రస్తుతం ఏడవ వారంలో ఉంది. సెకండ్ వైల్డ్ కార్డ్ శిల్ప చక్రవర్తి ఎంట్రీతో షోకు కొత్త జోష్ వచ్చిందనే చెప్పాలి. గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం తప్పకుండా నామినేట్ అయిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం శ్రీముఖి, రాహుల్, అలీ, మహేష్, రవికృష్ణ నామినేట్ అయ్యారు.

అయితే తొలిసారి నామినేషన్స్ లోకి వచ్చిన అలీ, ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే శ్రీముఖి, రవికృష్ణలకు కూడా బుల్లితెర వీక్షించే ప్రేక్షకులు అందరూ అభిమానులు కావడంతో వారు కూడా సేఫ్ అవ్వొచ్చు. అయితే ఇక మిగిలిన ఇద్దరు రాహుల్, మహేష్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. అందులోనూ హౌజ్ లో మొదటినుండి నెగటివ్ అవుతున్న రాహుల్ ఇంటినుండి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని సమాచారం. మరి వారాంతం వస్తే కానీ ఏ విషయం చెప్పలేం.