సమంత -నాగచైతన్యలలో హిట్ కొట్టేది ఎవరు


who will win in the race : Samantha or Nagachaitanyaఈనెల 13న సమంత నటించిన ” యు టర్న్ ” విడుదల అవుతోంది అలాగే నాగచైతన్య నటించిన ” శైలజారెడ్డి అల్లుడు ” కూడా విడుదల అవుతోంది దాంతో భార్యాభర్తల మధ్య పోటీ నెలకొంది . అలాగే ఈ ఇద్దరిలో హిట్ కొట్టేది ఎవరు ? అన్న ఆసక్తి కూడా నెలకొంది . తెలుగు , తమిళ బాషలలో సమంత యు టర్న్ విడుదల అవుతుండగా నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు మాత్రం తెలుగులో మాత్రమే రూపొందింది అయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాట కూడా విడుదల అవుతుంది . పైగా శైలజరెడ్డి గా రమ్యకృష్ణ నటించింది శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో .

వినోద ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మారుతి అన్న విషయం తెలిసిందే . పైగా అత్తా – అల్లుడు కాన్సెప్ట్ తెలుగునాట సక్సెస్ ఫుల్ ఫార్ములా కాబట్టి శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి ,ఇక సమంత యు టర్న్ కూడా విభిన్న తరహా చిత్రంగా తెరకెక్కింది . దాంతో ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్ అవుతుందో ?ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి . రెండు కూడా సెప్టెంబర్ 13న విడుదల అవుతున్నాయి .

English Title: who will win in the race : Samantha or Nagachaitanya