అన్న పెళ్ళికి అల్లు అర్జున్ ఎందుకు రాలేదో తెలుసా ?


allu arjun
allu arjun

అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఈ పెళ్ళికి అల్లు అర్జున్ హాజరు కాలేదు , అయినా ఈ పెళ్లి అతికొద్ది మంది సమక్షంలోనే చేసారు ఎందుకంటే అల్లు బాబీ కి ఇది రెండో పెళ్లి కాబట్టి . అయితే అల్లు కుటుంబం ఈ వేడుకలో పాల్గొంది కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనబడలేదు దాంతో అల్లు అర్జున్ ఈ పెళ్ళికి రాకపోవడానికి కారణం ఏంటో తెలిసింది .

ఆ కారణం ఏంటో తెలుసా …… అన్నయ్య మీద కోపం కాదు సుమా ! త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మాత్రమే పెళ్ళికి రాలేకపోయాడు . ప్రస్తుతం హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది . దాంతో పెళ్ళికి రాలేకపోయాడు అల్లు అర్జున్ . అయితే ఆ తర్వాత అన్నయ్య – వదిన లను కలిసి శుభాకాంక్షలు అందజేసాడట అల్లు అర్జున్ .