స్పెష‌ల్ స్టోరీ: ‌మోనాల్‌పై బిగ్‌బాస్‌కు ఎందుకంత ప్రేమ‌?స్పెష‌ల్ స్టోరీ: ‌మోనాల్‌పై బిగ్‌బాస్‌కు ఎందుకంత ప్రేమ‌?
స్పెష‌ల్ స్టోరీ: ‌మోనాల్‌పై బిగ్‌బాస్‌కు ఎందుకంత ప్రేమ‌?

బిగ్‌బాస్ సీజ‌న్ 1, సీజ‌న్ 2, సీజ‌న్ 3ల‌తో పోలిస్తే సీజ‌న్ 4కు విశ్వ‌స‌నీయ‌త క‌రువైన‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌త సీజ‌న్‌ల‌లో ఎవ‌రైతే వీక్ కంటెస్టెంట్ వుంటారో వారు ఒక‌టి రెండు వారాల‌కు మించి వున్న దాఖ‌లాలు లేవు. కానీ సీజ‌న్ 4లో మాత్రం అందుకు విరుద్ధంగా నిబంధ‌న‌ల‌ని ప‌క్క‌న పెట్టి ఓ కంటెస్టెంట్‌ని తొలి వారం నుంచి బిగ్‌బాస్ కాపాడుతూ వ‌స్తున్నారు.

ఇంటిలో ఎంతో మంది కంటెస్టెంట్‌లు నామినేష‌న రౌండ్‌లోకి ఎంట‌రై ఇంటిదారి ప‌ట్టారు. అమ్మా రాజ‌శేఖ‌ర్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే బిగ్‌బాస్ ఇంటి దారి ప‌ట్టించి షాకిచ్చారు. ఆ త‌రువాత మెహ‌బూబ్ ప‌రిస్థితి తెలిసిందే. కానీ వారికంటే వీక్‌గా వున్న మోనాల్‌ని మాత్రం ప్ర‌తీ వారం బిగ్‌బాస్ సేవ్ చేస్తూ టాప్ 7 వ‌ర‌కు తీసుకురావ‌డం సీజ‌న్ 4 విశ్వ‌స‌నీయ‌త కోల్పోయింద‌ని క్లియ‌ర్‌గా స్ప‌ష్ట‌మౌతోంది.

రెండు మూడు వారాల‌కే ఇంటిదారి ప‌ట్టాల్సిన మోనాల్ టాప్ 7లో వుందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం ప్రేక్ష‌కుల ఓటింగ్ కానేకాదు.. కేవ‌లం బిగ్‌బాస్. ఇంత‌లా ప‌క్ష‌పాతాన్ని చూపించ‌డం .. అభిజీత్‌, హారిక‌ల‌ని ఈ సండే నాగ్ ప్ర‌త్యేకంగా టార్గెట్ చేయ‌డంపై కూడా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారి గ్రాఫ్‌ని త‌గ్గించి మోనాల్‌, అఖిల్ గ్రాఫ్‌ని పెంచ‌డంలో భాగంగానే నాగ్ అభి, హారిక‌ల‌ని టార్గెట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోందని నెటిజ‌న్స్ నాగ్ పై ఫైర్ అవుతున్నారు. ఈ శనివారం నామినేష‌న్‌లో వున్న మోనాల్‌ని ఓటింగ్ పేరుతో మ‌రోసారి సేవ్ చేయ‌డం మ్యాచి ఫిక్సింగ్‌గా క‌నిపిస్తోంద‌ని.. ఊహ‌కంద‌ని రీతిలో బిగ్‌బాస్ టైటిల్‌ని మోనాల్ కి అందించినా ఆశ్చ‌ర్యం లేద‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.