బాలయ్య పూజలు ఎందుకు చేసినట్లు ?


Mokshagna and Balakrishna
Mokshagna and Balakrishna

నటసింహం నందమూరి బాలకృష్ణ కు పూజలు , ముహూర్తాల మీద నమ్మకం ఎక్కువ దాంతో బాలయ్య చేసే ప్రతీ పని ముహూర్తం చూసుకొని మరీ చేస్తుంటాడు అన్న విషయం తెలిసిందే . తాజాగా అంబాజీ పేట మండలం లోని పుల్లేటి కుర్రు అనే గ్రామంలో చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించాడు బాలయ్య . ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య తో పాటుగా వారసుడు మోక్షాజ్ఞ కూడా పాల్గొనడం విశేషం .

అయితే బాలయ్య , మోక్షాజ్ఞ వస్తున్న విషయాన్నీ గోప్యాంగ ఉంచారు , అలాగే పూజా కార్యక్రమాలు అయ్యాక బాలయ్య ఒక కారులో మోక్షజ్ఞ మరో కారులో వెళ్లిపోయారు . మోక్షాజ్ఞ ఆకారం చూసి షాక్ అయ్యారు అక్కడ ఉన్న జనాలు . ఇక బాలయ్య దేని కోసం ఇలా పూజలు చేసాడో అన్న చర్చ మొదలయ్యింది . పూజారులు మాత్రం కొత్త సినిమా కోసం పూజలు చేసారని అంటున్నారు .