మెగాస్టార్ ని కాదని మహేష్ తో..?


Why Mahesh babu N Why Not Megastar
Why Mahesh babu N Why Not Megastar

టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ అంటే అన్ని భాషల వారికి తెలిసిన గ్రేట్ నేమ్. తమిళ్ ఆడియెన్స్ కె కాకుండా అక్కడ సినీ ప్రముఖులకు సైతం మెగాస్టార్ అంటే చాలా ఇష్టపడతారు. ఇక రజినీకాంత్ లాంటి హీరో కూడా చిరంజీవి ని అత్యంత ఆప్త మిత్రుడిగా కొలిచేవారు. కానీ ఇటీవల వీరి మధ్య గ్యాప్ వచ్చినట్లు రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే.. మెగాస్టార్ అందుబాటులో ఉన్నప్పటికీ రజినీకాంత్ సూపర్ స్టార్ మహేష్ తో తన దర్బార్ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయించడం హాట్ టాపిక్ గా మారింది. లేకపోతే మెగాస్టారే రజినీకాంత్ కి నో చెప్పారా ? అనే టాక్ కూడా వస్తోంది. ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
మలయాళం లో మోహన్ లాల్.. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్.. ఇక కోలీవుడ్ నుంచి డైరెక్ట్ గా తోటి నటుడు కమల్ దర్బార్ మోషన్స్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మహేష్ రిలీజ్ చేయగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. గతంలో రోబో లాంటి సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ ని ఇన్వైట్ చేసిన రజినీకాంత్ ఇప్పుడు ఆయనను కాదని కొత్తగా మహేష్ ని సెలెక్ట్ చెలుకోవడం కాస్త అనుమానాలకు తావిస్తోంది. మరి ఆ అనుమానాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.