మ‌హేష్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఇదేనా?


మ‌హేష్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఇదేనా?
మ‌హేష్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచి వార్త‌ల్లో నానుతోంది. టెక్నీషియ‌న్‌ల కార‌ణంగా ఓ ద‌ఫా, చిరు లీక్డ్ పిక్స్ ద్వారా మ‌రోసారి, కార‌వాన్‌ల టాపిక్‌పై మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

ఇటీవ‌ల కీల‌క అతిధి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడంటే లేదు మ‌హేష్ న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి. 30 నిమిషాల నిడ‌విగ‌ల పాత్ర సినిమాకు అత్యంత కీల‌క‌మ‌ని, ఆ పాత్ర‌ని మ‌హేష్ చేత చేయించాల‌ని కొర‌టాల ప్లాన్ చేశారు. అయితే ఆ ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్టు వార్త‌లు షికారు చేయ‌డం మొద‌లైంది. ఇటీవ‌ల ఈ చిత్రం నుంచి త్రిష త‌ప్పుకోవ‌డంతో అస‌లు విష‌యం ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

ఈ చిత్రంలో మహేష్ చేత కీల‌క అతిథి పాత్ర‌ని చేయించాల‌ని అంతా ఫిక్స‌య్యార‌ట‌. 30 రోజుల పాటు కాల్షీట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నార‌ట‌. అయితే 30 డేస్‌కి ఫ‌ర్ డే కోటి అడిగార‌ని, `ఆచార్య‌` టీమ్ మాత్రం 15 కోట్లు ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డింద‌ట‌. దాంతో రెమ్యున‌రేష‌న్ అనుకున్న స్థాయిలో ఇవ్వ‌డం లేద‌ని మ‌హేష్ ఈ చిత్రం నుంచి ఫైన‌ల్‌గా త‌ప్పుకున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.