చిరు ట్విట్ట‌ర్ ఎందుకు మూగ‌బోయింది?చిరు ట్విట్ట‌ర్ ఎందుకు మూగ‌బోయింది?
చిరు ట్విట్ట‌ర్ ఎందుకు మూగ‌బోయింది?

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ట్విట్ట‌‌ర్ లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితేనేం లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా అద‌ర‌గొట్టేస్తానంటూ య‌మ స్పీడు చూపించారు. యంగ్ హీరోలు, స్టార్ హీరోస్‌.. మెగా ఫ్యామిలీ హీరోలు సోష‌ల్ మీడియ‌లో అంత‌గా యాక్టీవ్‌గా లేక‌పోయినా వారికి పూర్తి భిన్నంగా ట్వీట్‌లు చేస్తూ నిత్యం నెటిజ‌న్స్‌తో .. ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో వున్నారు. చిరు ట్విట్ట‌ర్ అకౌంట్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం ఆయ‌న‌ని ఫాలో అవ్వాల‌ని ఎదురుచూస్తున్న వాళ్లంతా ఒక్క‌సారిగా ఆయ‌న‌ప‌కు వెల్క‌మ్ చెప్పేసి ఫాలోవ‌ర్స్‌గా మారిపోయారు.

చిరుని ఫాలో అవుతున్న వారి సంఖ్య అన‌తి కాలంలోనే 822.7కెకి చేరింది. `అర్జున్‌రెడ్డి` ద‌ర్శ‌కుడు విసిరిన ఛాలెంజ్‌ని సైతం స్వీక‌రించి ఇంటి ప‌ని వంట ప‌ని చేసిన చిరు ఆ వీడియోల‌ని సైతం సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. త‌న‌కు హ‌నుమాన్ అంటే ఎందుకంత ఇష్ట‌మో అభిమానుల‌తో పంచుకున్నారు. బాపుగారు ప్రేమ‌గా గీసి ఇచ్చిన హ‌నుమాస్ చిత్ర ప‌టాన్ని ఎంత జాగ్ర‌త్త‌గా దాచుకున్నారో వివ‌రించి ఆ ఫొటోలో త‌న ముఖ క‌వ‌లిక‌లు క‌నిపిస్తున్నాయ‌ని బాపూగార‌న్నార‌ని ఆనాటి సంగ‌తుల్ని పంచుకున్నారు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇండ‌స్ట్రీకి సంబంధించిన కార్మికుల‌కు అండ‌గా వుండాల‌ని క‌రోనా క్రైసిస్ ఫండ్‌ని రైజ్ చేస్తున్నామ‌ని, ఆ ఫండ్ ద్వారా కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మూడు విడ‌త‌ల్లో కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించిన వీడియోల‌ని షేర్ చేయ‌డ‌మే కాకుండా ఇటీవ‌ల త‌న‌కు క‌రోనా పాఙ‌టివ్ వ‌చ్చింద‌న్న విష‌యాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఆ త‌రువాత అది కిట్ త‌ప్పిద‌మ‌ని క్లారిటీ ఇచ్చారు. స‌తీస‌మేతంగా వెళ్లి క‌ళాత‌ప‌స్వీ కె.విశ్వ‌నాథ్ దంప‌తుల్ని క‌లిసి వారితో గ‌డిపిన ఫొటోల్ని అభిమానుల‌తో పంచుకున్నారు. అయితే ఇంత స్పీడుగా ప్ర‌తీ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఆశ్చ‌ర్య‌పరిచిన చిరు ట్విట్ట‌ర్ గ‌త కొన్ని రోజులుగా మూగ‌బోయింది. కార‌ణం ఏంట‌న్న‌ది తెలియ‌డం లేదు. కావాల‌నే చిరు గ్యాప్ ఇచ్చారా?  లేక ట్విట్ట‌ర్ అంటే ఆయ‌న‌కు చిరాకు పుట్టిందా? అని అంతా అనుమానాం వ్య‌క్తం చేస్తున్నారు.