నిహారిక ఎంగేజ్‌మెంట్‌లో క‌నిపించ‌ని ప‌వ‌ర్‌స్టార్?



నిహారిక ఎంగేజ్‌మెంట్‌లో క‌నిపించ‌ని ప‌వ‌ర్‌స్టార్?
నిహారిక ఎంగేజ్‌మెంట్‌లో క‌నిపించ‌ని ప‌వ‌ర్‌స్టార్?

మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక నిశ్చితార్థం గురువారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. గుంటూరుకు చెందిన ఓ ఐజీ త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో మెగా డాట‌ర్ నిశ్చితార్థం జ‌రిగింది. అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీ సంద‌డి చేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, వైష్ణ‌వ్‌తేజ్‌, సుస్మిత, శ్రీ‌జ‌, క‌ల్యాణ్‌దేవ్‌, ఉపాస‌నతో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా పాల్గొన్నారు.

కానీ ఈ వేడుక‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మెగా ఫ్యామిలీ మెగా ఈవెంట్ అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మిస్స‌వ్వ‌డంతో ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ గ‌త కొన్ని రోజులుగా చ‌తుర్మాస దీక్ష చేస్తున్నారు. ఆ కార‌ణంగానే ఆయ‌న నిశ్చితార్థానికి హాజ‌రు కాక‌పోయి వుండ‌వ‌చ్చ‌ని కొంత మంది అంటున్నారు. మ‌రి నితిన్ ఎంగేజ్‌మెంట్‌లో ప‌వ‌న్ సంద‌డి చేశారు కదా? అని కొంత మంది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

నితిన్ ఎంగేజ్‌మెంట్‌లో క‌నిపించిన ప‌వ‌న్ సొంత అన్న నాగ‌బాబు కూతురు నిహారికి నిశ్చితార్థానికి హాజ‌రు కాక‌పోవ‌డం ఏంట‌ని ప‌లువురు వాదిస్తున్నారు. తాజా సంఘ‌ట‌న‌తో మెగా ఫ్యామిలీకి ప‌వ‌న్‌కు మ‌ధ్య మ‌ళ్లీ దూరం పెరిగిందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.