సంక్రాంతి సినిమాల పట్ల రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడేందబ్బా?సంక్రాంతి సినిమాల పట్ల రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడేందబ్బా?
సంక్రాంతి సినిమాల పట్ల రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడేందబ్బా?

తెలుగు సినిమాలకు సంబంధించి కొంత మంది సెలబ్రిటీలు తాము ఎంత బిజీలో ఉన్నా సరే సినిమాలు చూడటం వారికి నచ్చితే వెంటనే దాని గురించి ట్వీట్ చేయడం చూస్తూనే ఉన్నాం. దర్శక ధీరుడు రాజమౌళి ఈ విషయంలో అందరు దర్శకుల కన్నా ముందుంటాడు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా సినిమా చూస్తే ట్వీట్ చేయకుండా ఉండడు. రీసెంట్ గా తన అన్న కొడుకులు ఇద్దరూ చేసిన సినిమా మత్తు వదలరా సినిమా చూసి అందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరిన రాజమౌళి దాని తర్వాత ట్విట్టర్ లో అడ్రస్ లేడు. అప్పటి నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ తోనే బిజీ అయిపోయాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానుండడంతో రాజమౌళి నుండి ఏదొక సినిమాకు కుదిరితే రెండు, మూడు సినిమాలకైనా ట్వీట్స్ పడతాయని అంతా ఆశించారు. అయితే అటువంటిది ఏం జరగలేదు.

రాజమౌళి ఒక్క సంక్రాంతి సినిమా గురించి కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ లో ఉంటే కచ్చితంగా సినిమా చూస్తాడు జక్కన్న. మరి ఈసారి నిజంగానే షూటింగ్ బిజీలో పడి కుదరలేదా? లేక ఒక సినిమా గురించి ట్వీట్ చేసి మరో సినిమా గురించి విస్మరిస్తే బాగోదని ఊరుకున్నాడా? లేక నిజంగానే ఏ సినిమా తనకు నచ్చలేదా అన్నది తెలియలేదు కానీ ప్రస్తుతం రాజమౌళి ఇలా సంక్రాంతి సినిమాల పట్ల సైలెంట్ గా ఉండడం అభిమానులకు వింతగా అనిపిస్తోంది. అందులోనూ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను విపరీతంగా అభిమానిస్తాడు. త్రివిక్రమ్ మనసు పెట్టి మాస్ సినిమా తీస్తే తన అడ్రస్ గల్లంతవుతుంది అని చెప్పాడంటేనే త్రివిక్రమ్ అంటే రాజమౌళికి ఎంత అభిమానమో అర్ధమవుతోంది. మరి గురూజీ పూర్తి స్థాయిలో కంబ్యాక్ ఇచ్చిన చిత్రంగా చెప్పుకుంటున్న అల వైకుంఠపురములో విషయంలో కూడా సైలెంట్ గా ఉన్నాడంటే పై రీజన్స్ లో ఏది అసలు కారణమో మరి.