శ్రీ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా నాని స్పందించడే


why sri reddy hates nani soo much

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే . తాజాగా మరోసారి హీరో నాని పై ఆరోపణలు చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది . ”నాని కి నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది …… ఏం చేద్దాం నాని మరి ??” అంటూ తాజాగా నాని పై మళ్ళీ ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి . ఈ వివాదాస్పద భామ ఇలా ట్వీట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. బిగ్ బాస్ 2 షో ఈనెల 10 నుండి ప్రారంభం అవుతోంది అంతేకాదు ఆ షోలో శ్రీ రెడ్డి పాల్గొంటుండగా అదే షోకి నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .

అంటే ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి , ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది కాబట్టి ఏం చేద్దాం నాని అంటూ అతడ్ని కవ్విస్తోంది శ్రీ రెడ్డి . ఇంతకుముందు నాని పై ఘోరమైన వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి . నాని తెరమీద నటించడమే కాదు నిజ జీవితంలో కూడా నటించే న్యాచురల్ స్టార్ అంటూ కించపరచడమే కాకుండా పలువురు అమ్మాయిలను వాడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే శ్రీ రెడ్డి ఎంతగా ఆరోపణలు చేసినప్పటికి నాని మాత్రం అస్సలు స్పందించలేదు . కట్ చేస్తే ఇప్పుడు కూడా నాని కి సవాల్ విసురుతోంది దాంతో బిగ్ బాస్ 2 షోలో నాని శ్రీ రెడ్డి పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి .