రౌడీ “లాస్ట్ లవర్ స్టోరీ” అన్నది అందుకే…!

రౌడీ “లాస్ట్ లవర్ స్టోరీ” అన్నది అందుకే...!
రౌడీ “లాస్ట్ లవర్ స్టోరీ” అన్నది అందుకే…!

టాలీవుడ్ బక్సాఫీస్ కి సంక్రాంతి తరువాత ఆ స్థాయిలో ఒక రకమైన పండుగ వాతావరణం తీసుకొచ్చింది విజయ్ దేవరకొండ తాజా సినిమా “వరల్డ్ ఫేమస్ లవర్.” ఇప్పటికే ఈ వీకెండ్ అందులోనూ, ప్రేమికుల రోజు, కరెక్ట్ సెట్ ఆయే కథతో ఎంట్రీ ఇస్తున్నాడు టాలీవుడ్ రౌడీ స్టార్. ఇక తన ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ స్పీచ్ ఇచ్చే విజయ్ ఈసారి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తన లాస్ట్ లవ్ స్టోరీ అని… చెప్పడం అందరినీ ఒక్కసారి సర్ప్రైజ్ చేసింది.

విజయ్ దేవరకొండ కెరియర్ లో హీరోగా చేసిన మొదటి సినిమా “పెళ్లి చూపులు”, తరువాత వచ్చి పెద్ద హిట్ అయిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా, డియర్ కామ్రేడ్ అన్నీ లవ్ సినిమాలే. “నోటా” ఒక్కటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ పూరీ సర్ తో “ఫైటర్” అనే సినిమా చేస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో ఉండే పక్కా మాస్ సినిమా ఇది. ఇక విజయ్ తన తరువాత సినిమాలు కూడా మాస్, యాక్షన్ బేస్డ్ స్క్రిప్స్ అడుగుతున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఇండస్ట్రీ లో “లవర్ బాయ్” ఇమేజ్ ఎక్కువ కాలం లైఫ్ ఇవ్వదు. ఒక్కసారి లవ్ స్టోరీస్ ముద్ర పడితే తరువాత మిగిలిన సినిమాల్లో జనాలు ఆ నటుడిని అంగీకరించారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఇందుకు ప్రధాన ఉదాహరణ. టాలీవుడ్ లో సైతం తరుణ్, ఉదయకిరణ్ ఇల్లాంటి ఇబ్బందులే పడ్డారు. ఇక అటు తమిళ్ ఇటు తెలుగు లో ఒక వెలుగు వెలిగిన సిద్దార్థ్ ది కూడా ఇదే పరిస్థితి. వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్ లు తాజా ఉదాహరణలు. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే కెరియర్ పరంగా ఆయనకు సలహాలు ఇవ్వడానికి ఒక పెద్ద టీమ్ ఉంది కాబట్టి, వాళ్ళ చేసిన తీర్మానం ప్రకారం విజయ్ ఇక తను గేర్ మార్చాలని ఫిక్స్ అయ్యాడు అనుకోవచ్చు.