భార్య బీజేపీ, భర్త మరియు కొడుకు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీWife in BJP husband and son in ysrcp

తెలుగు జాతి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు ఎన్టీఆర్ . తెలుగుజాతి పౌరుషాన్ని తెలుగుదేశం పార్టీతో విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి గా కూడా బాధ్యతలు చేపట్టింది ఇక ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీలో ఉంది. భార్య బీజేపీ లో ఉండగా ఆమె భర్త మాజీ మంత్రి , మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తన కొడుకు హితేశ్ తో సహా.

 

భార్య ఒక పార్టీలో భర్త , కొడుకు మరో పార్టీలో చేరి చంద్రబాబు నాయుడుకు అధికారం దూరం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు తో దగ్గుబాటి కి పడలేదు దాంతో తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చాడు. అయితే పురందేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కేంద్రంలో అప్పుడు భాగస్వామిగా ఉంది, ఇక ఇప్పుడేమో కేంద్రప్రభుత్వం లోని పార్టీలో ఉంది. అప్పుడు రాష్ట్రాన్ని విడగొడుతుంటే చూస్తూ ఉంది , ఇక ఇప్పుడేమో నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్ కు ఎలాంటి సహాయం అందించకున్నా మోడీ ని ప్రశ్నించడం లేదు కానీ చంద్రబాబు అవినీతి కి పాల్పడుతున్నారు అంటూ గగ్గోలు పెడుతున్నారు పురందేశ్వరి , దగ్గుబాటి . రెవిన్యూ లోటుతో ఉన్న ఆంద్రప్రదేశ్ కోసం చంద్రబాబు కు అండగా ఉండాల్సిన వాళ్ళు అధికారం కోసం జగన్ పంచన మోడీ పంచన చేరారు. వీళ్లకు ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కంటే పదవులు మాత్రమే ముఖ్యం అనుకుంటా?

English Title: Wife in BJP husband and son in ysrcp