వైఫ్ ఆఫ్ రామ్ సక్సెస్ కోసం వైఫ్ ఆఫ్ నాని


wife of nani wishes to wife of ram

వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం సక్సెస్ కోసం వైఫ్ ఆఫ్ నాని ఆరాటపడుతోంది . మంచు లక్ష్మి కి నాని భార్య అంజనా మంచి ఫ్రెండ్ కావడంతో మంచు లక్ష్మి నటించిన వైఫ్ ఆఫ్ రామ్ విజయవంతం కావాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అందజేస్తోంది . ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మంచు లక్ష్మి కి శుభాకాంక్షలు అందజేసి సినిమాపై అంచనాలు పెంచేలా చేయడమే కాకుండా మంచు లక్ష్మి పై తమకున్న ప్రేమానురాగాలను వ్యక్తం చేసారు . కాగా ఇప్పుడు నాని భార్య అంజనా వంతు వచ్చింది .

కొత్త దర్శకుడు విజయ్ ఎలకంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్ – వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు . ఈనెల 20న వైఫ్ ఆఫ్ రామ్ విడుదలకు సిద్ధమైంది . టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచిన ఈ చిత్రం ట్రైలర్ తో మరింతగా ఆకట్టుకుంది . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం విభిన్న తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది . అంతేకాదు స్నేహశీలి అయిన మంచు లక్ష్మి కి సాలిడ్ హిట్ రావాలని మనసారా ఆకాక్షిస్తున్నారు పలువురు ప్రముఖులు అందుకే వరుస పెట్టి శుభాకాంక్షలు అందజేస్తూ వైఫ్ ఆఫ్ రామ్ పై ఆసక్తిని పెంచుతున్నారు . ఇక మంచు లక్ష్మీ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉంది . ఇక వైఫ్ ఆఫ్ రామ్ భవితవ్యం ఏంటి అన్నది తెలియాలంటే ఈనెల 20 వరకు ఎదురు చుడాల్సిందే .

English Title: wife of nani wishes to wife of ram