వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ


wife of ram movie review rating
వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ :
నటీనటులు : మంచు లక్ష్మి , ప్రియదర్శి , సామ్రాట్
సంగీతం : రఘు దీక్షిత్
నిర్మాతలు : విశ్వప్రసాద్ , మంచు లక్ష్మి
దర్శకత్వం : విజయ్ ఎలకంటి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 20 జూలై 2018

మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ” వైఫ్ ఆఫ్ రామ్ ”. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

దీక్ష ( మంచు లక్ష్మి ) భర్త రామ్ ( సామ్రాట్ ) ని చంపేస్తారు , అయితే దీక్ష మాత్రం గాయాలతో బయటపడుతుంది . తన భర్త ని హత్య చేసారని పోలీసులను ఆశ్రయిస్తుంది కానీ దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో తానే రంగంలోకి దిగాలని అసలు హత్య ఎవరు చేసారు ? ఎందుకు చేసారో తెలుసుకోవాలని దర్యాప్తు మొదలు పెడుతుంది . ఆ క్రమంలో షాకింగ్ విషయాలు తెలుస్తాయి దీక్ష కు . ఆమెకు తెలిసిన విషయం ఏంటి ? దీక్ష భర్త ని చంపింది ఎవరు ? ఎందుకు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

మంచు లక్ష్మి నటన
ఆదర్శ్ బాలకృష్ణ
ప్రియదర్శి
డైరెక్షన్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్
బోరింగ్ సీన్స్

నటీనటుల ప్రతిభ :

మంచు లక్ష్మి ఈ సినిమాని తన భుజస్కంధాలపై మోసింది , మర్డర్ మిస్టరీ తో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచు లక్ష్మి నటనే హైలెట్ గా నిలిచింది . పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడం తో మరింతగా రెచ్చిపోయి నటించి తన ప్రతిభ నిరూపించుకుంది మరోసారి . విలన్ గా ఆదర్శ్ బాలకృష్ణ సరిగ్గా సరిపోయాడు . హాస్య పాత్రలతో రాణిస్తున్న ప్రియదర్శి ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ గా నటించి మెప్పించాడు . సామ్రాట్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు అయితే ఉన్నంతలో బాగానే నటించాడు .

సాంకేతిక వర్గం :

రఘు దీక్షిత్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది , సామల భాస్కర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక దర్శకుడు విజయ్ విషయానికి వస్తే ……. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో మంచి ట్విస్ట్ తో రాసుకున్నాడు అయితే ఆ స్థాయిలో మెప్పించలేక పోయినప్పటికీ బాగానే రాణించాడు . ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలను మరింత బాగా రాసుకొని ఉంటే బాగుండేది .

ఓవరాల్ గా :

మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన వైఫ్ ఆఫ్ రామ్ సస్పెన్స్ థ్రిల్లర్ కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా .

English Title: wife of ram movie review rating

                                      Click here for English Review