వైల్డ్ డాగ్ టీజ‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారా?Wild dog teaser ready to release on that day
Wild dog teaser ready to release on that day

`మ‌న్మ‌థుడు 2` ఫ్లాప్‌తో నాగార్జున పంథా మారింది. కొత్త త‌ర‌హా చిత్రాల‌ని ఎంచుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఆ కోవ‌లో నాగ్ చేస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. వంశీ పైడి ప‌ల్లి చిత్రాల‌కు డైరెక్ష‌న్ టీమ్‌లో, స్టోరీ సిట్టింగ్స్‌లో కీల‌కంగా నిలిచిన అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాటినీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయామీఖేర్‌, దియా మీర్జా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

థాయ్ లాండ్‌ లో కీల‌క షెడ్యూల్ జ‌ర‌పాల‌నుకున్నారు కానీ క‌రోనా విజృంభ‌న‌తో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. షూటింగ్ కూడా ఆపేశారు. 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా ఎన్ ఐ ఏ అధికారిగా క‌నిపించ‌నున్నారు. ‌

ఈ చిత్ర టీజ‌ర్‌ని ఈ నెల 29న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగానే `వైల్డ్ డాగ్‌` టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌ట‌. ప్ర‌స్తుతం నాగార్జున `బిగ్‌బాస్ సీజ‌న్ 4` కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కోసం నాగార్జున ఇటీవ‌లే సెట్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే.