నాగార్జున `వైల్డ్ డాగ్` ట్రైల‌ర్ అదిరిందిగా!

నాగార్జున `వైల్డ్ డాగ్` ట్రైల‌ర్ అదిరిందిగా!
నాగార్జున `వైల్డ్ డాగ్` ట్రైల‌ర్ అదిరిందిగా!

కింగ్ నాగార్జున ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నుంచి వ‌ప్తున్న మ‌రో ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్ల‌ర్ `వైల్డ్ డాగ్‌`. అహిషోన్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ప ఈ చిత్రంలో అలీరెజా, స‌యామీఖేర్‌, దియా మీర్జా, రుద్ర గౌడ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని మెగాస్టార్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ` ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ట్రైల‌ర్‌పై స్పందించారు. `నా సోద‌రుడు నాగ్ ఇందులో ఎప్ప‌టిలాగే చాలా కూల్‌గా , ఎన‌ర్జిటిక్‌గా క‌నిపించారు. ఏ జోన‌ర్ సినిమా అయినా చేయ‌డానికైన భ‌యం లేకుండా ముంద‌డుగు వేసే న‌టుడు త‌ను. వైల్డ్ డాగ్‌` చిత్ర బృందానికి మా నిర్మాత నిరంజ‌న్‌రెడ్డికి శుభాకాంక్ష‌లు` అని ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ విజ‌య్ వ‌ర్మ‌గా న‌టించారు. `గోకుల్ ఛాట్‌లో బాంబు పేళుడు సంఘ‌ట‌న‌తో ఈ చిత్ర ట్రైల‌ర్ మొద‌లైంది. ఈ కేస్‌ని ఎన్ ఐ ఏకి అప్ప‌గిస్తాం అంటూ ఓ అధికారి చెప్ప‌డం.. వెంట‌నే విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో నాగార్జున త‌న టీమ్‌తో ఎంట్రీ ఇవ్వ‌డం.. వ‌రుస‌గా బాంబు పేళుళ్ల‌కు కార‌ణ‌మైన వారిని వేటాడి ఎన్ కౌంట‌ర్ చేయ‌డం ఇంట్రెస్టింగ్‌గా వుంది. `భాయ్ ఏంట్రా ఒక్క‌డే అబ్బ‌కు పుట్టారా? .. ఒక‌డు మ‌న దేశంలో వంద‌లాది మందిని చంపి మీరేమీ చేయ‌లేరు అంటే అందుకు నేను అంగీక‌రించ‌ను..` అంటూ నాగ్ చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ ట్రైల‌ర్‌పై మ‌హేష్ కూడా ట్వీట్ వేశారు. చాలా ఇంటెన్స్‌గా వుంద‌ని ప్ర‌శంసించారు.