ఐకాన్ లో దిశాపటాని నటించనుందా


Will Act Disha Patani in Icon
Will Act Disha Patani in Icon

‘లోఫర్’ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించిన అందాలభామ దిశాపటాని. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తెలుగు తెరకు పరిచయం చేశారు.. ఆ చిత్రం తరువాత ఈ ముద్దుగుమ్మ మరే తెలుగు చిత్రంలో నటించలేదు.. ఈ మధ్య కొన్ని అండర్వేర్ కంపినీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.. తాజాగా అందిన సమాచారం ఏంటంటే దిశాపటాని అల్లుఅర్జున్ నటిస్తోన్న ఐకాన్ చిత్రంలో నటిస్తోందని పుకార్ల వినిపిస్తున్నాయి.. రీసెంట్ గా దర్శకనిర్మాతలు ముంబై వెళ్లి దిశాపటానికి కథ వినిపించారని.. ఆకథ విని దిశా ఇంప్రెస్స్ అయి ఐకాన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం నగర్ సమాచారం.. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. వరుస విజయాలను సాధిస్తున్న దిల్ రాజు ఈ ఐకాన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.. అల్ అర్జున్-దిల్ రాజు కంబినేషన్ లో ఇది నాలుగవ చిత్రం కావడం విశేషం.. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..!!