సల్మాన్ ఖాన్ సరసన అలియా బట్ నటించనుందా?


Salman Khan
Salman Khan

కండల వీరుడు బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ నటిస్తోన్న ఇన్షా అల్లా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగష్ట్ 21నుండి మొదలుకానుంది.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ బన్సాలి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

కాగా ఈ చిత్రంలో క్యూట్ గర్ల్ అలియా బట్ హీరోయిన్ గా ఖరారైంది. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ దబంగ్-3 వాల్ల లేట్ అయింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. ఈ చిత్రంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. బన్సాలి చిత్రం అంటేనే సంథింగ్ స్పెషల్ అని అందరికీ తెలుసు.

మరి ఆయన చిత్రాల్లో హీరోయిజం భారీ స్థాయిలో ఎలివేట్ అవుతుంది. భర్తీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఫస్ట్ టైం సల్మాన్ సరసన అలియా నటిస్తుంది.. వీరి కాంబినేషన్లో సినిమా అంటే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.. !