అల్లరి నరేష్ -సునీల్ లు ఇప్పుడైనా హిట్ కొడతారా


will allari naresh and sunil gets succuess with silly fellows

అల్లరి నరేష్ కు హిట్ లేక ఏడెనిమిది సంవత్సరాలు కావస్తోంది , అసలైన హిట్ అంటే సుడిగాడు ఆ సినిమా తర్వాత అల్లరి నరేష్ చాలా చిత్రాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు . ఇక సునీల్ కూడా కమెడియన్ నుండి హీరో అయ్యాడు మొదట హిట్స్ ఇచ్చాడు కానీ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ పరంగా ఘోరంగా దెబ్బతిన్నాడు . అయితే కెరీర్ పరంగా ఘోరమైన స్థితిలో ఉన్న అల్లరి నరేష్ – సునీల్ లు కలిసి తాజాగా ” సిల్లీ ఫెల్లోస్ ” చిత్రంలో నటిస్తున్నారు ఇక ఈ సినిమాకు భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు దాంతో కాస్త ఆశలు ఉన్నాయి లేదంటే ఈ ఇద్దరు హీరోల సినిమాని పట్టించుకునే వాళ్లే లేరు .

ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా సెంటిమెంట్ ని కూడా పండించే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దాంతో సిల్లీ ఫెల్లోస్ కనీసం హిట్ అయినా అవుతుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు . సిల్లీ ఫెల్లోస్ ట్రైలర్ చూడటానికి బాగానే ఉంది , ఎంటర్ టైన్ మెంట్ మాత్రం పక్కా అని తెలుస్తోంది అందుకే చిన్న ఆశ సిల్లీ ఫెల్లోస్ పైన . కాగా ఈ సిల్లీ ఫెల్లోస్ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సిల్లీ ఫెల్లోస్ హిట్ అయితే తప్పకుండా అల్లరి నరేష్ , సునీల్ ల కెరీర్ అప్పుడైనా గాడిలో పడుతుంది లేదంటే షరా మామూలే !

English Title: will allari naresh and sunil gets succuess with silly fellows?