మారుతి కథకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా


will allu arjun accept maruthi script

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు హీరో అల్లు అర్జున్ , అయితే మధ్యలో కథలు మాత్రం వింటూనే ఉన్నాడట ! ఇక దర్శకులు మారుతి అల్లు అర్జున్ కు స్నేహితుడు అయినప్పటికీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు . మారుతి మాత్రం అల్లు అర్జున్ తో ఎప్పటినుండో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు కానీ చెబుతున్న కథలు కొద్దిరోజుల తర్వాత అవుట్ డేటెడ్ లాగా అనిపిస్తూ ఉండటంతో ఎప్పటికప్పుడు సినిమా వాయిదా పడుతూనే ఉంది అయితే ఈసారి మాత్రం తప్పకుండా అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని ఎందుకంటే లైన్ అనుకున్నానని అది త్వరలోనే అల్లు అర్జున్ కు చెబుతున్నానని దానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే స్క్రిప్ట్ పక్కాగా రూపొందిస్తానని అంటున్నాడు మారుతి .

అల్లు అర్జున్ మారుతికి ఛాన్స్ ఇచ్చేది లేనిది మరో వారం , పది రోజుల్లోనే తేలిపోనుంది ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నచ్చితే వెంటనే స్క్రిప్ట్ వర్క్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు మారుతి . అంటే అల్లు అర్జున్ ఇచ్చే గ్రీన్ సిగ్నల్ ని బట్టి మారుతి తదుపరి చర్యలు ఉంటాయి . ఇక శైలజారెడ్డి అల్లుడు విషయానికి వస్తే ….. సెప్టెంబర్ 13న విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ రాలేదు కానీ మూడు రోజుల వసూళ్లు బాగానే వచ్చాయి .

English Title: will allu arjun accept maruthi script ?