అల్లు శిరీష్ బిచ్చగాడు సినిమాలా కొడతాడా ?


అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏ బి సి డి చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో అల్లు శిరీష్ సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. హీరోగా పరిచయమైన తర్వాత ఈ హీరో నటించిన చిత్రమేదీ సూపర్ హిట్ కాలేదు కాకపోతే శ్రీరస్తు శుభమస్తు మాత్రం ఓ మాదిరి హిట్ అనిపించుకుంది. అల్లు అర్జున్ హీరోగా స్టార్ డం అందుకున్నాడు కానీ అల్లు శిరీష్ కనీసం హిట్ కూడా దక్కించుకోలేకపోతున్నాడు.

మే 9 న విడుదలైన మహేష్ మహర్షి అంతగా బ్లాక్ బస్టర్ అవ్వలేదు దాంతో అల్లు శిరీష్ మే 17 న ధైర్యంగా తన సినిమాని విడుదల చేసుకోవచ్చు . తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం అందునా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉన్న చిత్రం కావడంతో ఎబిసిడి చిత్రానికి ప్లస్ కానుంది . మహర్షి ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి అల్లు శిరీష్ సినిమా బాగుంటే మరో బిచ్చగాడు సినిమాలా పేలే ఛాన్స్ ఉంటుంది. బ్రహ్మోత్సవం సినిమాతో పోటీపడి బిచ్చగాడు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . .అయితే ఇలా ఆలోచించడం దుస్సాహసమే అని చెప్పాలి ఎందుకంటే అల్లు శిరీష్ కు ఆ యోగం ఉందొ ? లేదో ?