విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా నెగ్గుకు రావడం కష్టమేనా ?


Anand Devarakonda
Anand Devarakonda

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిన విషయం తెలిసిందే . దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు ఆనంద్ దేవరకొండ . అయితే ఫీచర్స్ పరంగా చూస్తుంటే మాత్రం హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . విజయ్ దేవరకొండ చూపులో ఉన్న చురుకుదనం  ఆనంద్ దేవరకొండ లో లేదని తేల్చి పడేస్తున్నారు

పైగా దొరసాని టీజర్ లో ఆనంద్ దేవరకొండ అంతగా ప్రభావం చూపించలేక పోయాడు . అయితే క్యారెక్టర్ తెలంగాణ యువకుడి పాత్ర అందునా అమాయకమైన యువకుడి పాత్ర కావడంతో అలా ఉన్నాడా ? లేక స్వతహాగానే ఆనంద్ అలా ఉన్నాడా ? అన్నది జూలై 12 తేలనుంది . నటుడిగా సత్తా చాటితే హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది లేదంటే హీరోగా ప్రభావం చూపలేని తమ్ముళ్ల జాబితాలో చేరిపోతాడు