ఏపీ ప్రజలు కేసీఆర్ ని గెలిపిస్తారా ? చంద్రబాబునా ?

Will AP voters support to KCR or Chandrababu naidu ?ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి అలాగే పార్లమెంట్ స్థానాలకు కూడా . అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒకవైపు కేసీఆర్ , జగన్ , నరేంద్ర మోడీ ఒకవైపు ఉన్నారు . చంద్రబాబు నాయుడుని అదేపనిగా కేసీఆర్ , కేటీఆర్ విమర్శిస్తున్నారు . చంద్రబాబుని ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు అంతేనా జగన్ కు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాకుండా అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు .

 

ఇక బీజేపీ శ్రేణులు కూడా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు , ఇక మోడీ అయితే చంద్రబాబు ని ఓడించాలని కంకణం కట్టుకున్నాడు దాంతో చంద్రబాబు పై ముప్పేట దాడి చేస్తున్నారు . ఇప్పటికే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ అయ్యిందని , చంద్రబాబు ని ఓడించడమే మా లక్ష్యమని ప్రకటించారు . అసలు ఎన్నికలు కాకుండానే  చంద్రబాబు ఓడిపోయాడని , ఓడిపోతున్నాడని జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడని ప్రచారం చేస్తున్నారు కూడా . ఇంతమంది చంద్రబాబు పై దాడి చేస్తుంటే బాబు గెలవడం కష్టమే అని అంటున్నారు కొంతమంది అయితే ఇదే సానుభూతి వ్యక్తమై గెలుస్తాడని మరికొంతమంది అంటున్నారు . ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ ని గెలిపిస్తారా ? చంద్రబాబు ని గెలిపిస్తారా చూడాలి .  జగన్ ని గెలిపించడం అంటే కేసీఆర్ ని గెలిపించినట్లే లెక్క !

English Title : Will AP voters support to KCR or Chandrababu naidu ?