నాగ శౌర్య రేంజ్ ను మార్చగలిగే చిత్రమిదే!


Will Aswadhama prove Naga Shouryas mettle
Will Aswadhama prove Naga Shouryas mettle

యువ హీరో నాగ శౌర్యకు ఊహలు గుసగుసలాడే, కల్యాణ వైభోగమే వంటి హిట్లు అయితే ఉన్నాయి అప్పట్లో తన రేంజ్ చాలా లిమిటెడ్ గా ఉండేది. కేవలం 4 – 5కోట్ల మధ్యనే వసూళ్లు ఉండేవి. అయితే గత ఏడాది చేసిన ఛలో నాగ శౌర్య రేంజ్ పూర్తిగా మార్చేసింది. కొత్త దర్శకుడితో సొంత నిర్మాణంలో ఒక రకంగా రిస్క్ చేసిన శౌర్యకు మంచి ఫలితమే వచ్చింది. ఈ సినిమా ఏకంగా 10 కోట్ల షేర్ ను క్రాస్ చేసింది. యూత్ లో శౌర్యకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో అతను విఫలమయ్యాడు. రెండోసారి తన బ్యానర్ లోనే చేసిన నర్తనశాలకు విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. అయితే కంటెంట్ పరంగా వీక్ గా ఉండడంతో ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత చేసిన అమ్మమ్మ గారిల్లు అయితే పెద్ద ప్లాప్ గా నిలిచింది.

దీంతో మళ్ళీ క్రైసిస్ పరిస్థితిలో పడ్డ శౌర్య, మళ్ళీ రిస్క్ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ లోనే మూడో ప్రయత్నంగా అశ్వద్ధామను నిర్మిస్తున్నాడు. మూడోసారి భారీ బడ్జెట్ ను సెట్ చేసుకున్నాడు. పూర్తి యాక్షన్ మోడ్ లోకి మారిపోతున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిట్టైంది. ఏకంగా రెండు రోజుల్లోనే 4 మిలియన్ వ్యూస్ సాధించింది. యూట్యూబ్ లో టాప్ లో ఒకరోజంతా ట్రెండ్ అయింది. ఇది శౌర్య రేంజ్ పెరిగింది అనడానికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.

ఇప్పటిదాకా సాఫ్ట్ రోల్స్ తోనే నెట్టుకొస్తున్న ఈ హీరో ఈసారి యాక్షన్ ఘట్టాలు గట్టిగానే చేసినట్టున్నాడు. అందుకే టీజర్ అంతా ఫైట్లతోనే నింపేసాడు. అలాగే బడ్జెట్ కూడా భారీగానే పెట్టాడు. అన్నట్టు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ దీనికి శౌర్యనే కథ రాసుకున్నాడు. కొత్త దర్శకుడి చేతిలో ఈ చిత్రాన్ని పెట్టాడు. మరి నాగ శౌర్య చేస్తున్న ఈ రిస్క్ పే ఆఫ్ అవుతుందేమో చూడాలి.