గజదొంగ బయోపిక్ జూన్ లో


తెలుగునాట బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ఇప్పటికే పలు బయోపిక్ లు విజయం సాధించగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి అయినప్పటికీ బయోపిక్ ల హవా మాత్రం తగ్గడం లేదు . అయితే ఇన్నాళ్లు మంచి వాళ్ళు , మానవత్వం ఉన్నవాళ్లు , నాయకులు అంటూ ప్రముఖ వ్యక్తుల బయోపిక్ లు తీశారు కానీ మొదటిసారి ఓ గజదొంగ బయోపిక్ ని రూపొందించడానికి సిద్దమయ్యాడు దర్శకులు వంశీ కృష్ణ . ఇంతకీ ఈ యువ దర్శకుడు తీయాలనుకుంటున్న బయోపిక్ ఎవరిదో తెలుసా …… స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు ది .

1980 వ దశకంలో స్టూవర్ట్ పురం గజదొంగ గా హడలెత్తించిన టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ కు శ్రీకారం చుట్టాడు వంశీకృష్ణ . ఇక ఈ చిత్రంలో గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అప్పటి సంఘటనల సమాహారమే ! టైగర్ నాగేశ్వర్ రావు కథ . మరి ఈ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా మెప్పిస్తాడో ?