చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా ?


ఒకప్పుడు శంకర్ లాంటి గొప్ప దర్శకుడితో పని చేయాలనీ ప్రతీ హీరో కోరుకున్నాడు , అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా . కానీ కాలం మారింది శంకర్ వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్నాడు . రోబో సినిమా తర్వాత చేసిన 3 ఇడియట్స్ , ఐ చిత్రాలు ఘోరంగా దెబ్బ తీశాయి . ఇక అత్యంత భారీ బడ్జెట్ తో 2. ఓ తీస్తే అది కూడా ప్లాప్ అయ్యింది . దాంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు . ఇక ఇప్పుడేమో కమల్ హాసన్ తో భారతీయుడు 2 అనే చిత్రం చేస్తున్నాడు కానీ అది ముందుకు ఒక అడుగు వెనక్కి ఏడడుగులు అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి .

ఆ సినిమా షూటింగ్ జరగడమే లేదు కానీ చిరంజీవి తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట శంకర్ . అయితే సరైన కథ కుదిరితే ఛాన్స్ ఇస్తాడేమో చిరంజీవి అంతేకాని ఇప్పటి ట్రాక్ రికార్డ్ ప్రకారం ఐతే చిరు అంత త్వరగా శంకర్ కు ఛాన్స్ ఇవ్వడం కష్టమే ! ఎందుకంటే శంకర్ పీక్స్ లో ఉన్నప్పుడు మనం సినిమా చేద్దామని స్వయంగా చిరంజీవి అడిగాడట ! కానీ శంకర్ ఆ రకంగా అయితే ఎప్పుడు ప్రయతించలేదు కానీ ఇప్పుడు సక్సెస్ లేదు దాంతో చిరు ఛాన్స్ ఇవ్వడం కష్టమే ! అని అంటున్నారు .